రంజాన్‌ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ మండిపడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? అంటూ సంచలన వ్యాఖ్యలు (Bandi Sanjay Slams Congress) చేశారు.

ముస్లిం ఉద్యోగులు గంట ముందు ఆఫీసు నుండి వెళ్లిపోవచ్చు, రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, మార్చి 2 నుంచి మార్చి 31 వరకు వర్తింపు

తెలంగాణలో హిందువులది బిచ్చపు బ్రతుకైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది అదే అయ్యప్ప మాల, శివ మాల, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు అధికార కాంగ్రెస్‌ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. హిందువుల పండుగలకు కూడా అవసరమైనప్పుడు వెసులుబాటు ఇస్తున్నామని చెబుతోంది.

Bandi Sanjay Slams Congress Leaders:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)