జీహెచ్‌ఎమ్‌సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాగుట్ట నాగార్జున్ సర్కిల్ వద్ద ఫుట్‌పాత్‌పై నడుస్తూ ఆమె అనుకోకుండా జారి కింద పడిపోయారు (Hyderabad). నగర సుందరీకరణ పనుల్లో భాగంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్దకు మేయర్ వెళ్లిన సమయంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. మేయర్ పడిపోవడాన్ని గమనించిన వెంటనే డిప్యూటీ మేయర్ శ్రీలత, విజయా రెడ్డి ఆమెను పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయమైనట్టు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. ఆ తరువాత మేయర్ ఇతర కార్యక్రమాల్లో యథావిథిగా పాల్గొన్నారు.
GHMC Mayor Vijayalakshmi Fell Down
మేయర్ విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం
సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద స్ట్రీట్ లైట్ పోల్ తట్టుకొని కింద పడ్డ మేయర్ గద్వాల విజయలక్ష్మి.#Telangana #hyderabad #mayor #incident #RTV pic.twitter.com/ja82cmMmEK
— RTV (@RTVnewsnetwork) February 3, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)