ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సీటు కోసం కర్చీఫ్ వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి జుట్టు పట్టుకొని బస్సు కిందకు దిగి మరీ అందరూ వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఫ్రీ బస్సు కష్టాలు ఇంకా తీరలేదు.. సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..షాకింగ్ వీడియో ఇదిగో
కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మీ స్కీం తీసుకొచ్చిన సంగతి విదితమే.మహిళలకు ఆర్డినరి, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. ఇందుకు సరైన గుర్తింపు కార్డు ఉంటే చాలు మహిళలు ఈ రెండు బస్సు సర్వీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంచక్కా తిరగొచ్చు. అయితే, ఫ్రీ బస్సు పలు చోట్ల మహిళలు గొడవకు దిగడంతో పాటు కొట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Women Engage in Ugly Fight, Pull Each Others Hair Over Seat on TSRTC Bus in Hanamkonda
ఆర్టీసీ బస్సు సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు.
కాళేశ్వరం బస్టాండ్ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సీటు కోసం కర్చీఫ్ వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి సిగలు పట్టుకొని బస్సు కిందకు దిగి మరీ అందరూ… pic.twitter.com/smDGEeiWdG
— ChotaNews App (@ChotaNewsApp) February 3, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)