బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆడియో లీక్ అయింది. అయితే ఆ ఆడియోలో వాయిస్ ఆయనదేనా లేక వేరొకకరిదా అనేది ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ ఆడియో మాత్రం వైరల్ అవుతోంది. పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా.
బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు నాకు బ్రోకరిజం చేయడం రాదు.గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వమని సూచిస్తే, నా సూచనలు పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీతో తిరిగే వ్యక్తికి ఇచ్చారని మండిపడినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది.ఎందుకు ఇలా చేశారు అని ఒక కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారని చెప్పినట్లుగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నాను, వెంటనే గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పదవిని నేను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని రాజాసింగ్ వ్యాఖ్యానించినట్లుగా ఆడియోలో ఉంది.
బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆడియో
పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి
తాము ఇచ్చిన పేరు కాకుండా గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్‌గా వేరే వ్యక్తిని నియమించడం పట్ల అసహనం
పార్టీకి మా అవసరం లేదనుకుంటా అంటూ ఆడియోలో సంచలన వాఖ్యలు pic.twitter.com/0s0IteQYCL
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025
సొంత పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన పార్టీకి తాను అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు.https://t.co/xtG1xW1ujF#Telangana…
— RTV (@RTVnewsnetwork) February 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)