దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌(Danam Nagender)తో పాటు గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

తెలంగాణ చరిత్రలో తొలిసారి అత్యధిక పెట్టుబడులు సాధించి, రికార్డు సృష్టించారు సీఎం రేవంత్ రెడ్డి. రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు..49500 ఉద్యోగాలు దావోస్(Davos) పర్యటన ద్వారా సాధించారు. అమెజాన్(Amazon) లాంటి అంతర్జాతీయ టాప్ కంపెనీ, రాష్ట్రంలో రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. రూ.750కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ తెలిపింది. దీంతో కొత్తగా 17వేల ఉద్యోగాలు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  దావోస్ వేదికగా తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవే, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు

Grand welcome to CM Revanth  Reddy at Shamshabad Airport 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)