అన్‌సీజన్‌లో హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట.. ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరు జల్లులు కురియగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గట్టిగానే దంచికొట్టింది. ఒకవైపు గత రెండు మూడు రోజులుగా నగరంలో చలి విజృంభణతో నగరవాసులు వణికిపోతుండగా, ఇప్పుడు వర్ష ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Here's Video
Earlier morning unexpected moderate #rainfall with thunderstorm accompanied by gusty winds on Friday. @ind2day #Hyderabad #oldcity pic.twitter.com/DNdShMsZbU
— Mohd Lateef Babla (@lateefbabla) January 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)