Seethakka At Mini Medaram Jatara: మినీ మేడారం జాతరలో మంత్రి సీతక్క.. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి, జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి

మినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క(Seethakka At Mini Medaram Jatara).

Seethakka At Mini Medaram Jatara: మినీ మేడారం జాతరలో మంత్రి సీతక్క.. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి, జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి
Minister Seethakka at Mini Medaram Fair celebrations(video grab)

మినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క(Seethakka At Mini Medaram Jatara). అమ్మల గద్దెలపై మొక్కులు చెల్లించుకుని, రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు సీతక్క(Seethakka).

13న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమతో అమ్మవార్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు(Mini Medaram Jatara). ఫిబ్రవరి 14న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వీలు కల్పించనున్నారు. 15న అమ్మవార్లకు ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. దీంతో మండ మెలిగే పండుగ ఘట్టం ముగుస్తుంది.

రాజ్యసభకు తమిళ నటుడు,ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్,.. సీఎం స్టాలిన్ నుండి స్పష్టమైన హామీ, క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పీకే శేఖర్ బాబు!

మినీ జాతర(Mini Medaram 2025) నేపథ్యంలో ఆర్టీసీ వివిధ డిపోల నుండి 200 బస్సులు నడిపించనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా తొమ్మిది డిపోలు ఉండగా, అవసరాన్ని బట్టి ఆయా డిపోలన్నింటి నుంచి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110 ఛార్జీ చేయనున్నారు.

Minister Seethakka at Mini Medaram Fair celebrations

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 13, 2025 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).