తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో విచారణలో భాగంగా ఏసిబి అధికారులు ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు అధికారులైన ఎస్. రాంచందర్, CEO, లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ & జి. కళ్యాణ్ కుమార్ (అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రికి OSD)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై రాష్ట్రానికి దాదాపుగా 2.10 కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురు అధికార్లను ఏసిబి అరెస్ట్ చేసింది. తెలంగాణ గొర్రెల స్కాంలో నలుగురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్, చంచలగూడ జైలుకు తరలించిన అధికారులు, మార్చి 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్
రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్), హైదరాబాద్‌లోని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాజీ OSD గుండమరాజు కళ్యాణ్ కుమార్, ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. కుట్రలు చేసి, స్థూల చట్టవిరుద్ధమైన చర్యలు, ఉల్లంఘనలకు పాల్పడ్డారు. నిందితులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమంగా అనుచిత లబ్ధి పొంది ప్రభుత్వ ఖజానాకు అన్యాయమైన నష్టం కలిగించి రూ.2.1 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు.
ఏసీబీ ఆధికారులు వారిద్దరినీ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రెండు వారాల రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గొర్రెల స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు ఏసీబీ ఆధికారులు పదిమందిని అరెస్ట్ చేశారు.
Here's ACB Tweet
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో విచారణలో భాగంగా #ఏసిబి అధికారులు ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు అధికారులైన ఎస్. రాంచందర్, CEO, లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ & జి. కళ్యాణ్ కుమార్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రికి OSD. ఈ ఇద్దరూ కలిసి కొందరు ప్రైవేట్… pic.twitter.com/1Kv8jzC1Vp
— ACB Telangana (@TelanganaACB) May 31, 2024
Ex Minister Talasani Srinivas Yadav’s OSD arrested in Sheep scam
ACB arrest two top officers in Sheep Distribution Scheme scam.
In continuation of investigation of the case related to the scam in the Sheep
Distribution Scheme, on Friday Telangana ACB arrested Two
more… pic.twitter.com/fU7fZJwS2K
— Sudhakar Udumula (@sudhakarudumula) May 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)