బీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీ మారారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ గెలుపుపై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు, 16 సీట్ల‌తో చంద్ర‌బాబు చేసింది ఇదే..రేవంత్ రెడ్డి చేయ‌లేనిది ఇదే అంటూ కామెంట్స్

పోచారం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని, రాజకీయంగా తానేమీ ఆశించట్లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, రైతుల సంక్షేమం కోసం నిజాయతీగా పాటుపడుతోందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అన్నదాతను ఆదుకునే విషయంలో వెనుకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైందని ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రగతి, రైతుల ప్రగతి కోసం పనిచేస్తానని వివరించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)