తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రధాన నేత శ్రీధర్‌ రెడ్డి రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి హత్య చేశారు. శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, శ్రీధర్‌ రెడ్డి హత్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.  ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రూ. 100 కోట్లు పంపారు, రాష్ట్రంలో యూ ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారంటూ బీజేపీ నేత‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)