Hyd, July 18: రైతు రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు రుణమాఫీ విడుదల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేశామని, అయినా మేం రాజీనామా చేయమని అడగడం లేదు. ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారని మాకు తెలుసు' అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు.మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని... ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. నేను రెడీ, నువ్వు రెడీనా, రాజీనామాపై హరీష్ రావు కీలక ప్రకటన, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేయకుండా..

ఈరోజు రుణమాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసింది. రూ.1 లక్ష వరకు రుణం ఉన్న వారికి నిధులు జమ చేసింది. రైతు ఖాతాల్లోకి రూ.7 వేల కోట్లు జమ చేసింది. ఈ నెలాఖరు లోపు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగస్ట్ దాటకముందే రూ.2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)