free coaching to TGPSC Group1 aspirants: తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు నెలకు రూ 5,000 స్టైఫండ్‌తో పాటు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.కాగా టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 1:50 ప్రకారం మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది.గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబర్ 21 నుంచి 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో 1:100 రేషియోతో అభ్యర్థుల ఎంపిక ఉండాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం మాత్రం 1:50 రేషియాతో ఫలితాలను వెల్లడించడం గమనార్హం.  ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్‌ లో ఓసారి, డిసెంబర్‌ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)