వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొత్తం తొమ్మిది లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. రెండో జాబితాలో వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పేర్లను ప్రకటించారు. జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్దన్‌ను నిర్ణయించారు.

తొలి జాబితాలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను తొలి జాబితాలో ఖరారు చేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ నుంచి పోటీ చేసే 15 మంది అభ్యర్థుల లిస్ట్ ఇదిగో, ఏపీ నుంచి ఇంకా తేలని కాషాయం పార్టీ అభ్యర్థులు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)