తెలుగు రాష్ట్రాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది. పలువురు ప్రముఖుల తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీడియోలు ఇవిగో, అమృత విద్యాలయంలో ఓటేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఒవైసీ
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు హక్కు! భారత రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును నా కుటుంబ సభ్యులతో కలిసి నేను వినియోగించుకున్నాను. మీరూ త్వరగా పోలింగ్ కేంద్రాలకు రండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటేయ్యండి. ముందు ఓటు తర్వాతే ఏపనైనా. భవితకు భరోసానిచ్చే ఓటును నిస్వార్థంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకుని.. సమర్థ నాయకులను ఎన్నుకోండి. ఓటు హక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే అర్హత ఉండదని గుర్తుంచుకోండని ట్వీట్ చేశారు.
Here's His Tweet
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు హక్కు! భారత రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును నా కుటుంబ సభ్యులతో కలిసి నేను వినియోగించుకున్నాను. మీరూ త్వరగా పోలింగ్ కేంద్రాలకు రండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటేయ్యండి. ముందు ఓటు తర్వాతే ఏపనైనా. భవితకు భరోసానిచ్చే ఓటును నిస్వార్థంగా… pic.twitter.com/es9H1vrjAO
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)