భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు.. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు..వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12). గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి.. ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు.

అయితే కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. దీనికి ప్రతి వారం రూ. 200 కిస్తీ కట్టాల్సి ఉంటుంది. కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా.. భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో చందన కొన్నాళ్లుగా చందన కిస్తీలు కట్టలేకపోయింది.

మేడిపల్లిలో దారుణం, అయ్యప్ప మాల ధరించి భార్య‌ను బండరాయితో తలపై కొట్టి చంపిన భర్త, ఇల్లు విషయంలోఘర్షణలే కారణమని వార్తలు

దీనిపై ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురైన చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా.. ఇరుగుపొరుగువారు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మంగళవారం మృతిచెందింది.

Couples Dies by suicide in Jayashankar Bhupalpally district

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)