మహాలక్ష్మీ పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి విదితమే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. రద్దీ కూడా చాలా ఎక్కుగా ఉండటంతో మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో మహిళలు తక్కువ దూరం వెళ్ళేటప్పుడు ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కకుండా పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి. దూరప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలిగించొద్దు. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులు ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులు అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, అద్దెకు బస్సులు కావాలని ప్రకటన విడుదల చేసిన టీఎస్‌ఆర్టీసీ, పూర్తి వివరాలు ఇవిగో.. 

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)