కాకతీయ యూనివర్సిటీలో(Kakatiya University) అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలు కర్రీలో, సాంబారులో పురుగులు దర్శనమిచ్చాయి. హన్మకొండ కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ(Worms found in potato curry), సాంబారులో పురుగులు కనిపించాయి.
దీంతో హాస్టల్ డైరెక్టర్, అధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వారం క్రితం ఇదే మెస్‌లో సీనియర్లు, జూనియర్లు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక తెలంగాణలోని నిజామాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ చేశారు. సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యలు రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Worms found in potato curry and sambar at Kakatiya University
కాకతీయ యూనివర్సిటీలో ఆలు కర్రీలో, సాంబారులో పురుగులు
హన్మకొండ కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ, సాంబారులో పురుగులు కనిపించాయి
దీంతో హాస్టల్ డైరెక్టర్, అధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా… https://t.co/FE3GMob4nY pic.twitter.com/UFHs4gT92I
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)