గూగుల్ యూట్యూబ్ కి షాకిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ కొత్త యాప్ తీసుకువస్తోంది. వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube)కు దీటుగా యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. ఎక్స్‌ టీవీ యాప్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ కూడా యూట్యూబ్‌ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.టీవీ యాప్‌ విశేషాలతోపాటు, ఇంటర్‌ఫేస్‌ ఎలా ఉండనుందనే విషయానికి సంబంధించి ఓ చిన్న వీడియోను ఆమె తన ఎక్స్ లో పోస్టు చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)