టెక్ దిగ్గజం గూగుల్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు Down Detector India తెలిపింది. గూగుల్ కు చెందిన యూట్యూబ్, జీమెయిల్, డ్రైవ్ తో పాటు సెర్చ్ ఇంజిన్ సేవలు కాసేపు డౌన్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్ వర్క్ స్పేస్ లోకి లాగిన్ కాలేకపోతున్నామని సోషల్ మీడియా వేదికలపై ఫిర్యాదులు చేశారు. గూగుల్ సర్వర్లలో సాంకేతిక సమస్యే దీనికి కారణం అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యకు గల కారణం ఏంటి అనేది గూగుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)