Newdelhi, Mar 23: శివుడు-శక్తి (Shiva-Shakti) కలయికే విశ్వ ఆవిర్భావానికి మూలమని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు సైన్స్ పరంగానూ అది నిజమని చూచాయగా తెలుస్తున్నది. భూగ్రహం ఉన్న పాలపుంత (Milkey way) కూడా రెండు నక్షత్ర సముదాయాల (చిన్న గెలాక్సీలు) కలయికతో ఏర్పడినట్టు గుర్తించామని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు తాజాగా తెలిపారు. సుమారు 1200-1300 కోట్ల ఏండ్ల కిందట ఇది జరిగినట్టు పేర్కొన్నారు. దాని పర్యావసానమే ప్రస్తుతం మనం చూస్తున్న పాలపుంత గెలాక్సీ అని తెలిపారు. ఆ రెండు నక్షత్ర సముదాయాలకు ‘శివ-శక్తి’ అని నామకరణం చేశారు.
Astronomers who discovered what could be the early building blocks of the #MilkyWay have named them #Shiva and #Shakti https://t.co/VHEr1nCNkT
— IE Science (@iexpressscience) March 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)