వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎనిమిది మంది మాత్రమే గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ తాజాగా జుకర్ బెర్గ్ వాయిస్ కాల్స్ చేసే సదుపాయాన్ని 8 మంది నుంచి 32 మందికి పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ఒకే సారి 32 మందికి వాట్సాప్ నుంచి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీడియో, పీడీఎఫ్ వంటి 1జీబీ డేటా ఫైల్స్‌ను పంపుతుండగా ఇకపై 2జీబీ వరకు ఫార్వర్డ్ చేయోచ్చు.
చాలా వాట్సప్ గ్రూప్‌లు ఉంటే.. అందరికి ఒకే సమయంలో ఒకే మెసేజ్‌ను పంపేలా టూల్‌ను డిజైన్ చేయనున్నట్లు వాట్సాప్ స్పోక్ పర్సన్ తెలిపారు. రోజూవారీ జీవితంలో భాగమైన చాటింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత అడ్వాన్స్‌గా యూజర్లకు పరిచయం చేసేలా కొత్త కొత్త యాప్స్‌ను బిల్డ్ చేస్తున్నట్లు జుకర్ బెర్గ్ తెలిపారు.
All you need to know about #WhatsApp's multiple new features
Read HERE | https://t.co/CgfXeVARPx pic.twitter.com/sWiMDdVzvm
— DNA (@dna) April 14, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)