ట్విట్టర్ (ఎక్స్) సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్ నెంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్ సదుపాయం తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఐఓఎస్, పీసీ, ఆండ్రాయిడ్ లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్ బుక్ కు ఎక్స్ వేదిక అవుతుందని అన్నారు. మరోవైపు ఈ కొత్త ఆప్షన్ల గురించి ఎక్స్ సీఈవో లిండా యాకరినో కొన్ని రోజుల క్రితమే వెల్లడించారు. ఇన్స్టాలో ఉన్నట్టుగానే ఎగువన కుడివైపు ఉండే డీఎం మెనూలో కాలింగ్ ఆప్షన్ ఉంటుందని చెప్పారు.

Video and Audio Calls in X (Photo-X)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)