టర్కీ, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భూకంపాలు ఆ రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చాయి. వేల మందిని పొట్టనపెట్టుకున్నాయి.ఈ భూకంపానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కంటతడిపెడుతున్నారు. తాజాగా ఓ ఫోటోలో మంచంపై నిద్రస్తూనే శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఓ 15 ఏండ్ల బాలిక చేయి పట్టుకుని ఆమె తండ్రి నిశ్చేష్ఠుడై కూర్చున్న తీరు చూపరుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.మెసట్‌ హన్సర్‌ అనే వ్యక్తి కుటుంబం భూకంపంలో చిక్కుకుపోయింది. భూకంపం వచ్చినప్పుడు హన్సర్‌ బయట ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. మిగిలినవారంతా శిధిలాల్లో సమాధి అయ్యారు.

Here's Heart Breaking Photo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)