యుఎస్ మరోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతోంది. ఫెడరల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ల వైఖరిని అధికార డెమోక్రాట్లు నిరసిస్తున్నారు. దీంతో షట్‌డౌన్‌ వైపు ఆ దేశం అడుగులు వేస్తున్నది. దేశంలో షట్‌డౌన్‌ పరిస్థితులను నివారించడానికి నిధుల విడుదలను మరో 30 రోజలు పాటు పొడిగించాలని ప్రవేశపెట్టిన బిల్లును అమెరికా ప్రజాప్రతినిధుల (దిగువ) సభ తిరస్కరించింది. రిపబ్లికన్‌కు చెందిన హౌస్‌ స్పీకర్‌ కెవిన్‌ మెక్‌ కార్తీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు 198-232 ఓట్లతో ఓడిపోయింది. కాగా, షట్‌డౌన్‌ కనుక జరిగితే దేశంలోని ముఖ్య శాఖలు, విభాగాలకు నిధులు, సిబ్బందికి జీతాలు నిలిచిపోతాయి

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)