గురువారం రాత్రి కీవ్ గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చిన ర‌ష్యా విమానాన్ని కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్ల‌డించింది. రాత్రి పూట కీవ్ న‌గ‌రంపై పేల్చివేత‌కు గురైన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. సెంట్ర‌ల్ కీవ్ ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు జ‌రిగాయి. మ‌రో పేలుడు దూర ప్రాంతంలో చోటుచేసుకున్న‌ట్లు అధికార వ‌ర్గాలు ద్వారా తెలుస్తోంది. గురువారం రాత్రి కీవ్ లో జ‌రిగిన దాడికి సంబంధించి తొలుత స‌మాచారం రాలేదు. ఏదో గుర్తు తెలియ‌ని వ‌స్తువును పేల్చిన‌ట్లు తెలిపారు. కానీ ఆ త‌ర్వాత ర‌ష్యా యుద్ధ విమానాన్ని పేల్చిన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)