ఆఫ్రికా దేశం సెనగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కఫ్రిన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78 మంది గాయపడ్డారు. దేశంలోని ఒకటో నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు టైరు పంక్చర్ అయింది. దీంతో అదుపుతప్పి రోడ్డుకు అవతలివైపునకు దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి. కాగా ఈ ఘటనపట్ల దేశ అధ్యక్షుడు మాక్కి సాల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు దేశంలో సంతాప దినాలు పాటించాలని ప్రకటించారు.
Here's Update
Senegal Road Accident: 40 Killed, Dozens Injured in Bus Crash in Gniby Region, President Macky Sall Announces Three-Day National Mourninghttps://t.co/uleF9bg8zv#Senegal #RoadAccident #Death #BusCrash #MackySall #Mourning
— LatestLY (@latestly) January 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)