AB De Villiers Retires: సౌతాఫ్రికాకు. ఆర్సీబీకి షాక్, అన్ని పార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్, ఆడాలన్న కసి తగ్గిపోయిందని ట్వీట్
AB de Villiers Retires (Photo-File)

సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు గుడ్‌బై (AB de Villiers Retires) చెప్పేశాడు. అన్ని పార్మాట్ల నుంచి’ తప్పుకుంటున్నట్టు ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘ప్రతిభ ఎళ్లవేళలా ఉండదని, ఆడాలన్న కసి తనలో తగ్గిపోయిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తన కెరియర్ ఒక అపూర్వమైన ప్రస్థానమని, క్రికెట్ ఆడిన ప్రతి దశలోనూ ఆటను ఆస్వాదించానని అన్నాడు. 37 ఏళ్ల వయసులో క్రికెట్‌ నుంచి తప్పుకోక (South African Batsman Announces Retirement) తప్పడం లేదన్నాడు.

అది దక్షిణాఫ్రికా కానీ, ఆర్సీబీ కానీ లేదంటే టైటాన్స్ కానివ్వండి.. క్రికెట్ తనకు ఊహించనంత అనుభవాన్ని, అవకాశాలను కల్పించింది. దీనిని నేను సదా రుణపడి ఉంటాను’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. గతంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ‘మిస్టర్ 360’ తాజా నిర్ణయంతో ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా ముగింపు పలికినట్టు అయింది.

ఐపీఎల్‌‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్ మొత్తం 156 మ్యాచుల్లో 4,491 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత ఇదే అత్యధికం. ఆర్సీబీకి ఆడడానికి ముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు డివిలియర్స్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 184 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్.. 5,162 పరుగులు చేశాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2015లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 133 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్‌కు మళ్లీ షాక్, భారత్ T20 సిరీస్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం, టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి రెడీ అవుతున్నట్లు తెలిపిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు

అలాగే, 114 టెస్టులు ఆడి 50.66 సగటుతో 8,765 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు ఉన్నాయి. 228 వన్డేల్లో 25 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలతో 9,577 పరుగులు చేశాడు. 78 టీ20ల్లో 1,672 పరుగులు చేశాడు. కాగా, డివిలియర్స్ తాజా నిర్ణయంతో ఆర్సీబీతో అతడి బంధానికి తెరపడనుంది.