AB de Villiers (Photo credit: Instagram @abdevilliers17)

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఇంటర్ననేషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులకు షాక్ లోకి తీసుకెళ్లాడు. 2004లో సౌతాఫ్రికా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డివిలియర్స్‌.. 2018లో సడన్‌గా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో యావత్తు క్రికెట్‌ ప్రపంచం షాక్‌కు గురైంది. తాజాగా తన అకస్మిక నిర్ణయానికి గల కారణాన్ని డివిలియర్స్‌ వెల్లడించాడు.

నా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తూ నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్‌ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్‌ సలహా మెరకు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నానని వెల్లడించాడు.

తాను చచ్చేవరకు ఐపీఎల్ ఆడుతూనే ఉంటా, ఆర్సీబీ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సంచలన వ్యాఖ్యలు

ఇంటర్ననేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం రెండేళ్ల పాటు ఆడాను. ఆ సమయంలో అదృవశాత్తూ కంటి వల్ల ఎటువంటి సమస్య తలెత్తలేదని" విజ్డెన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్‌ పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున 111 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో ఏబీబీ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లు కలిపి 20014 పరుగులు చేశాడు.