జింబాబ్వేపై అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ మరుసటి రోజే జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. అత్యంత దూకుడుగా ఆడి కేవలం 47 బంతుల్లో సెంచరీ బాదాడు. దీంతో రెండవ మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్న యువ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.హరారే వేదికగా జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండవ టీ20లో శుభమాన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసి 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు. ఆ వెంటనే ఔటయ్యాడు. రెండో టీ-20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్.. 100 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా..
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జూలై 7, ఆదివారం నాడు వరుసగా మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో తన సెంచరీ పూర్తి చేసిన మొదటి భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వెల్లింగ్టన్ మసకద్జా వేసిన 14వ ఓవర్‌లో, అభిషేక్ మూడు, నాల్గవ, ఐదవ బంతిని సిక్స్‌లు కొట్టి 46 బంతుల్లో సెంచరీ సాధించాడు.