Rohit Sharma

నిన్న జరిగిన మ్యాచ్ లోని 18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ జారవిడిచిన క్యాచ్‌ వల్ల రోహిత్‌ సేన భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.అర్ష్‌దీప్‌ తప్పిదంతో బతికిపోయిన పాక్‌ ఆటగాడు అసిఫ్‌ అలీ.. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదాడు.

ఇక ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లోనూ మరోసారి బంతిని బౌండరీకి తరలించాడు. చివరి ఓవర్‌ నాలుగో బంతికి అసిఫ్‌ అలీని అర్ష్‌దీప్‌ అవుట్‌ చేసినా అప్పటికే మ్యాచ్‌ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి రెండు బంతుల్లో పాక్‌ విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఇఫ్తికర్‌ అహ్మద్‌ లాంఛనం పూర్తి చేసి తమ జట్టును గెలిపించాడు.కీలకమైన సమయంలో అర్ష్‌దీప్‌ క్యాచ్‌ నేలపాలు చేయడంతో ఉత్కంఠగా మ్యాచ్‌ వీక్షిస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

భారత్ ఫైనల్‌కు చేరాలంటే, పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించాలి,అలాగే భారత్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలివాలి, అది కూడా భారీ రన్ రేట్‌తో..

Here's Video

మైదానంలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏంటిది.. ఏం చేశావో అర్థమైందా నీకసలు’ అన్నట్లుగా అరుస్తూ అర్ష్‌దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.