Australia all-rounder Glenn Maxwell

మార్చి 17 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ సహా పేసర్‌ జై రిచర్డ్‌సన్‌ పునరాగమనం చేయనున్నట్లు తెలిపింది.

ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ వంటి అనుభవజ్ఞులతో సహా మార్నస్‌ లబుషేన్‌, సీన్‌ అబాట్‌ తదితరులకు జట్టులో చోటిచ్చింది. ముంబై మ్యాచ్‌తో సిరీస్‌కు తెరలేవనుండగా.. వైజాగ్‌(మార్చి 19), చెన్నై(మార్చి 22)లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక ఇప్పటికే బీసీసీఐ ఆసీస్‌తో సిరీస్‌కు వన్డే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు.

ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునేందుకు బరిలోకి దిగనున్న హర్మన్ సేన

వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు:

పాట్ కమిన్స్ (సి), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

వన్డే సిరీస్‌కు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్‌.