Australia all-rounder Glenn Maxwell

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు ముందే ఆస్ట్రేలియాకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌, గ్రీన్‌ గాయపడగా తాజాగా వారి జాబితాలోకి ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ చేరాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా మాక్స్‌వెల్‌ కాలి మడమకు గాయమైంది. దీంతో అతడు ప్రోటీస్‌తో టీ20 సిరీస్‌కు దూరమమ్యాడు.తన భార్యతో కలిసి తిరిగి స్వదేశానికి పయనమైనట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అతడి స్ధానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా భర్తీ చేసింది

ఇదిలా ఉంటే వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు మ్యాక్స్‌వెల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆసీస్‌ మెనెజ్‌మెంట్‌ భావిస్తోంది. ప్రపంచకప్‌కు ముందు భారత్‌లో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అశిస్తున్నామని" టోనీ డోడెమైడ్ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్‌కు 17 మంది సభ్యులతో కూడి ప్రిలిమనరీ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆ జట్టులో మాక్స్‌వెల్‌కు కూడా చోటు దక్కింది.

వెక్కి వెక్కి ఏడ్చిన లంక ఆల్‌రౌండర్‌, చెల్లిపెళ్లి చేసుకొని వెళ్లిపోతుందని కన్నీరు పెట్టుకున్న హసరంగ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అప్పగింతల వీడియో

ఇక ఆగస్టు 30 న జరగనున్న తొలి టీ20తో ఆసీస్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ప్రోటీస్‌తో మూడు టీ20లు, 5 వన్డేలు కంగారూ జట్టు ఆడనుంది.

దక్షిణాఫ్రికాతో తలపడే ఆస్ట్రేలియా టీ20 జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), సీన్ అబాట్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, మాథ్యూ వేడ్, ఆడమ్ జాంపా.