Sakariya's Father Dies: కరోనాతో కన్నుమూసిన రాజస్థాన్ రాయల్స్ పేస‌ర్ చేత‌న్ సకారియా తండ్రి, కరోనాతో ఒకే రోజు ఇద్దరు భారత హాకీ మాజీ క్రీడాకారుల కన్నుమూత
COVID-19 Outbreak in India | File Photo

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పేస‌ర్ చేత‌న్ సకారియా తండ్రి క‌రోనాతో మరణించారు. కొన్ని రోజులు క్రితం క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డ చేత‌న్ స‌కారియా తండ్రి (Sakariya's Father Dies) ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. చేత‌న్ స‌కారియా తండ్రి మృతికి ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ తీవ్ర సంతాపం వ్య‌క్తంచేసింది. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేసింది

ఈ ఏడాది క‌రోనావ‌ల్ల అర్ధాంత‌రంగా నిలిచిపోయిన ఐపీఎల్ సీజ‌న్-14లో చేత‌న్ స‌కారియా (ajasthan Royals pacer Chetan Sakariya) 7 వికెట్లు తీశాడు. ఇటీవ‌లే టోర్నీ ఆగిపోవ‌డం, ఇప్పుడు తండ్రి క‌రోనా కాటుకు బ‌లికావ‌డం స‌కారియాకు తీవ్ర మ‌నోవేద‌న‌ను మిగిల్చాయి. స‌కారియా సోద‌రుడు కూడా నాలుగు నెల‌ల క్రిత‌మే మృతిచెందాడు.

ఇక భారత హాకీ జట్టు మాజీ ఆటగాళ్లు రవీందర్‌ పాల్‌ సింగ్‌ (Ravinder singh) (60), ఎమ్‌కే కౌషిక్‌ (66) (kaushik) కరోనాతో మృతి చెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన రవిందర్‌ పాల్‌ సింగ్‌.. గత రెండు వారాలుగా లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఇక 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులోనే సభ్యుడైన కౌషిక్‌ కూడా కొవిడ్‌-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

కరోనా కల్లోలం..ఐపీఎల్ నిరవధిక వాయిదా, తాజాగా సన్‌రైజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లకు కరోనా, ఐపీఎల్ 2021 వాయిదాను అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా

అర్జున, ద్రోణాచార్య అవార్డులు అందుకున్న కౌషిక్‌.. భారత పురుషుల, మహిళల జట్లకు కోచ్‌గానూ వ్యవహరించారు. వీరి మృతి పట్ల కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Here's Kiren Rijiju Tweets

ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి పట్ల హాకీ ఇండియా (హెచ్‌ఐ) సంతాపం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌ స్వర్ణ పతకం సాధించిన ఆటగాళ్లుగా వారిద్దరూ భారత హాకీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతారని హెచ్‌ఐ అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోంబామ్‌ శ్రద్ధాంజలి ఘటించారు.

ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా కౌశిక్‌ భారత హాకీపై తనదైన ముద్ర వేశాడు. ఆయన శిక్షణలో భారత పురుషుల జట్టు 1998 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకోగా... భారత మహిళల జట్టు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. కౌశిక్‌ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ముందుగా అర్జున, ఆపై ‘ద్రోణాచార్య’ పురస్కారాలతో సత్కరించింది.

979 జూనియర్‌ ప్రపంచకప్‌లో సభ్యుడి నుంచి సీనియర్‌ టీమ్‌కు వెళ్లిన రవీందర్‌ పాల్‌ 1984 వరకు సెంటర్‌ హాఫ్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 1984 లాస్‌ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్న అతను 1982 ఆసియా కప్‌లో, రెండు చాంపియన్స్‌ ట్రోఫీలలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు.