Ruturaj Gaikwad playing a shot (Photo credit: Twitter)

ఐపీఎల్‌ రెండో దశ ఆరంభ మ్యాచ్‌లో (CSK vs MI VIVO IPL 2021) చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. 24 రన్స్‌కే సగం మంది పెవిలియన్‌లో కూర్చున్న వేళ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 నాటౌట్‌) సంయమన ఆటతీరుతో అండగా నిలిచాడు. ఆ తర్వాత బౌలర్ల జోరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (Chennai Super Kings vs Mumbai Indians) ముంబై ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ( Chennai Super Kings) 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. జడేజా (26)తో కలిసి గైక్వాడ్‌ ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. ఆఖర్లో డ్వేన్‌ బ్రావో (8 బంతుల్లో 3 సిక్సర్లతో 23) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత ఛేదనలో ముంబై (Mumbai Indians) 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్‌ తివారీ (40 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్‌)కి సహకారం కరువైంది. బ్రావోకు మూడు, దీపక్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రుతురాజ్‌ నిలిచాడు.

ఆ ఒత్తిడే కారణమా..టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ, రేసులో రోహిత్ శర్మ, ధోనీ నుంచి పగ్గాలు చేపట్టిన తరువాత కోహ్లీ విజయాలు, అపజయాలు గురించి ఓ సారి తెలుసుకుందాం

ఈ సందర్భంగా ముంబైపై రుతురాజ్‌ ఒక కొత్త రికార్డును నమోదు చేశాడు.ముంబై పై అత్యధిక స్కోర్‌ సాధించిన ఆటగాడిగా గైక్వాడ్‌ రికార్డు సాధించాడు. అంతకు ముందు మైఖల్‌ హాస్సీ 86 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. తాజాగా గైక్వాడ్‌ అతన్ని అధిగమించాడు. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అభిమానులను తనదైన శైలిలో ఉత్సాహపరిచాడు. సీఎస్‌కే అంటేనే విజిల్‌ పోడు అనేలా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ధోని ఈల వేశాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్కోరు వివరాలు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (నాటౌట్‌) 88; డు ప్లెసిస్‌ (సి) మిల్నే (బి) బౌల్ట్‌ 0; మొయిన్‌ అలీ (సి) తివారీ (బి) మిల్నే 0; అంబటి రాయుడు (రిటైర్డ్‌ హర్ట్‌) 0; రైనా (సి) రాహుల్‌ చహర్‌ (బి) బౌల్ట్‌ 4; ధోని (సి) బౌల్ట్‌ (బి) మిల్నే 3; జడేజా (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 26; బ్రావో (సి) కృనాల్‌ (బి) బుమ్రా 23; శార్దుల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156.

వికెట్ల పతనం: 1–1, 2–2, 3–7, 4–24, 5–105, 6–144. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–1–35–2, మిల్నే 4–0–21–2, బుమ్రా 4–0–33–2, పొలార్డ్‌ 2–0–15–0, రాహుల్‌ చహర్‌ 4–0–22–0, కృనాల్‌ పాండ్యా 2–0–27–0.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (ఎల్బీ) (బి) దీపక్‌ చహర్‌ 17; అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (బి) దీపక్‌ చహర్‌ 16; సూర్యకుమార్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) శార్దుల్‌ 3; ఇషాన్‌ కిషన్‌ (సి) రైనా (బి) బ్రావో 11; సౌరభ్‌ తివారీ (నాటౌట్‌) 50; పొలార్డ్‌ (ఎల్బీ) (బి) హేజల్‌వుడ్‌ 15; కృనాల్‌ (రనౌట్‌) 4; మిల్నే (సి) (సబ్‌) గౌతమ్‌ (బి) బ్రావో 15; రాహుల్‌ చహర్‌ (సి) రైనా (బి) బ్రావో 0; బుమ్రా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 136.

వికెట్ల పతనం: 1–18, 2–35, 3–37, 4–58, 5–87, 6–94, 7–134, 8–135.

బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–18–2, హేజల్‌వుడ్‌ 4–0–34–1, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–29–1, మొయిన్‌ అలీ 3–0–16–0, డ్వేన్‌ బ్రావో 4–0–25–3, రవీంద్ర జడేజా 1–0–13–0.