Mohammed Siraj (Photo-X)

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో భారత్‌ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. 358 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక.. 3.1 ఓవర్లు ముగిసేసరికి 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి బంతికే వికెట్‌ కోల్పోయిన లంకను సిరాజ్‌ రెండో ఓవర్లో భారీ దెబ్బ కొట్టాడు. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే నిస్సంక వికెట్ల ముందు దొరికిపోయాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ భారీ సిక్స్ వీడియో ఇదిగో, 106 మీటర్ల దూరం వెళ్లిన బంతి, వన్డే వరల్డ్‌కప్ 2023లో లాంగెస్ట్ సిక్స్ ఇదే..

రెండో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. లంకకు డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. తొలి బంతికే దిముత్‌ కరుణరత్నెను ఎల్బీగా వెనక్కి పంపిన సిరాజ్‌.. ఐదో బంతికి లంక కీలక బ్యాటర్‌ సధీర సమరవిక్రమను ఔట్‌ చేశాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి రివ్యూ తీసుకుని బతికిపోయిన సమరవిక్రమ.. ఐదో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నాలుగో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. మరోసారి తొలి బంతికే లంకను దెబ్బతీశాడు. కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌.. నాలుగో ఓవర్లో మొదటి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.