IPL 2022, GT vs RCB Highlights: గుజరాత్ ఖాతాలో మరో సూపర్ విక్టరీ, పరాజయాలు కంటిన్యూ చేస్తూ ఆర్సీబీ, హాఫ్ సెంచరీతో కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినప్పిటికీ దక్కని విక్టరీ, ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ బెర్త్ దాదాపు ఖారారు

Mumbai, April 30: ఐపీఎల్ 2022 (IPL-2022) సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. గుజరాత్ ఖాతాలో (Gujarat Titans) మరో విజయం చేరింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bangalore) జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అదరగొట్టింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరుని చిత్తు చేసింది. బెంగళూరు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (3) (Hardik Pandya) విఫలం కాగా.. రాహుల్ తెవాతియా (43*) (Rahul Tewatia), డేవిడ్ మిల్లర్ (39*) (David miller), వృద్ధిమాన్‌ సాహా (29), శుభ్‌మన్ గిల్ (31), సాయి సుదర్శన్ (20) రాణించారు. బెంగళూరు బౌలర్లలో షాహ్‌బాజ్, హసరంగ తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో గుజరాత్‌ (16) ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే.

ఆర్సీబీ ప్లేయర్స్‌ లో కెప్టెన్ డుప్లెసిస్ (0) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (58) (Virat Kohli), రజత్ పటీదార్ (52), మ్యాక్స్‌వెల్ (38) రాణించారు. చివర్వలో మహిపాల్ లోమ్రార్ (16) కూడా బ్యాటు ఝుళిపించాడు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

IPL 2022: ఐపీఎల్ చరిత్ర‌లో అత్యంత స్పీడ్ బాల్, 153 కిలోమీట‌ర్ల వేగంతో యార్కర్, వృద్ధిమాన్ సాహాను క్లీన్ బౌల్డ్ చేసిన ఉమ్రాన్ మాలిక్

కోహ్లీ అర్ధశతకంతో ఫామ్‌లోకి వచ్చినా కూడా.. అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. మొత్తమ్మీద 53 బంతులు ఎదుర్కొన్న అతను 58 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఆటతీరుపై మిశ్రమంగా స్పందిస్తున్నారు.