ఐపీఎల్‌లో తమ జోరును కొనసాగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో (Delhi Capitals Beat Chennai Super Kings by Five Wickets) చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో (DC vs CSK Highlights Dream11 IPL 2020) ఓపెనర్ శిఖర్ ధవన్ (58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. ఇక ఆరు ఓటములతో చెన్నై తమ ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది.
డుప్లెసి (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), అంబటి రాయుడు (25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 45 నాటౌట్), వాట్సన్ (28 బంతుల్లో 6 ఫోర్లతో 36) ఆదుకోగా చివర్లో జడేజా (13 బంతుల్లో 4 సిక్సర్లతో 33 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. నోకియాకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ (Delhi Capitals) 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసి గెలిచింది. అక్షర్ (5 బంతుల్లో 3 సిక్సర్లతో 21 నాటౌట్) దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ధవన్ నిలిచాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి (Chennai Super Kings) సరైన ఆరంభం లభించలేదు. తుషార్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌లో మూడో బంతికే స్యామ్ కరన్ (0) అవుటయ్యాడు. అయితే డు ప్లెసిస్, వాట్సన్ భాగస్వామ్యం జట్టును ముందుకు నడిపించింది. నోర్జే ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో ప్లెసిస్ దూకుడు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్ ఓవర్లో వీరిద్దరు కలిసి 15 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో చెన్నై 85 పరుగులు చేయగలిగింది. తుషార్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన డుప్లెసిస్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా 15 ఓవర్లలో స్కోరు 112 పరుగుల వద్ద నిలిచింది.
రెండో వికెట్‌కు ప్లెసిస్, వాట్సన్ 67 బంతుల్లో 87 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లు సూపర్ కింగ్స్‌కు బాగా కలిసొచ్చాయి. ధోని (3) మళ్లీ విఫలమైనా... రాయుడు, జడేజా జోడి ఒకరితో మరొకరు పోటీపడి చెలరేగారు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి జడేజా 4 సిక్సర్లు, రాయుడు 3 సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో మొత్తం 67 రావడం విశేషం. నోర్జే వేసిన చివరి ఓవర్లో జడేజా కొట్టిన రెండు వరుస సిక్స్‌లు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. బౌలర్ చావ్లా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జాదవ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. 180 పరుగుల లక్ష్యాన్నిఢిల్లీ ముందు చెన్నై ఉంచింది.
కష్టసాధ్యమైన లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీకి ఆద్యంతం ఓపెనర్ ధవన్ అండగా నిలిచాడు. తొలి ఓవర్‌లోనే మేడిన్ వికెట్‌గా పృథ్వీ షా అవుటయ్యాడు. అటు అజింక్యా రహానె (8) కూడా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ రెండు వికెట్లను దీపక్ చాహర్ తీశాడు. ఈ దశలో చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ధవన్ కళ్లు చెదిరే షాట్లతో ఢిల్లీని మ్యాచ్‌లో నిలబెట్టాడు. అతడికి కాసేపు శ్రేయాస్ (23) అండగా నిలిచాడు. వీలు చిక్కినప్పుడల్లా ధవన్ వరుస ఫోర్లతో చెన్నైపై ఒత్తిడి పెంచసాగాడు. అటు 12వ ఓవర్‌లో అయ్యర్ వికెట్‌ను బ్రావో తీయడంతో మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
స్టొయినిస్ రాగానే సిక్స్, ఫోర్‌తో 13వ ఓవర్‌లో 13 పరుగులు రాబట్టాడు. 16వ ఓవర్‌లోనూ ఓ సిక్సర్ బాదిన అనంతరం పేసర్ శార్దూల్‌కు దొరికిపోయాడు. అయితే చివరి 26 బంతుల్లో 43 పరుగులు కావాల్సి ఉండగా మ్యాచ్ ఇరు పక్షాల వైపు ఉందనిపించింది. ఈ దశలో గబ్బర్ 17వ ఓవర్‌లో వరుసగా 4,6తో తన ఉద్దేశాన్ని చాటాడు. 19వ ఓవర్‌లో క్యారీ (4) వికెట్ తీసిన కర్రాన్ 4 పరుగులే ఇవ్వడంతో చివరి 6 బంతుల్లో ఢిల్లీకి 17 రన్స్ అవసరమవగా ఉత్కంఠ ఏర్పడింది. అయితే బ్రావో అందుబాటులో లేకపోవడంతో జడేజా బంతి తీసుకోగా.. అక్షర్ మూడు సిక్సర్లతో పండగ చేసుకుని ఏకంగా 21 పరుగులు అందించాడు.
తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ సామ్ కర్రాన్ డకౌట్.. రెండో ఓవర్‌లో రబాడ ఒక్క పరుగూ ఇవ్వలేదు.. ఇదీ టాస్ గెలిచాక బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు పరిస్థితి. కానీ వెటరన్ బ్యాట్స్‌మెన్ వాట్సన్, డుప్లెసి తమ అపార అనుభవంతో ఇన్నింగ్స్‌ను పట్టాలెక్కించి రెండో వికెట్‌కు 87 పరుగులు జత చేశారు. ఆ తర్వాత రాయుడు అండగా నిలవగా చివర్లో జడేజా చెలరేగాడు. మూడో ఓవర్‌లో వాట్సన్ రెండు ఫోర్లతో, ఐదో ఓవర్‌లో డుప్లెసి 6,4,4 బాదగా పవర్ ప్లేలో చెన్నై 39 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా పదో ఓవర్‌లో వాట్సన్ మూడు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అటు డుప్లెసి ఓ సిక్స్, ఫోర్‌తో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.
చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 21 పరుగులు కావాల్సి ఉండగా... 19వ ఓవర్లో స్యామ్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి క్యారీ (4)ని అవుట్ చేశాడు. 99 పరుగుల స్కోరు వద్ద ధావన్ కీపర్ క్యాచ్ కోసం అప్పీల్ చేసిన ధోని రివ్యూకు కూడా వెళ్లాడు. అయితే రీప్లేలో అది నాటౌట్‌గా తేలింది. తర్వాతి బంతికి సింగిల్ తీసిన శిఖర్ ఐపీఎల్‌లోనే కాకుండా తన టి20 కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు. జడేజా వేసిన చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా... అక్షర్ పటేల్ మూడు సిక్సర్లు బాది క్యాపిటల్స్‌కు గెలుపును ఖాయం చేశాడు.
స్కోరు బోర్డు
చెన్నై: సామ్ కర్రాన్ (సి) నోకియా (బి) తుషార్ దేశ్‌పాండే 0; డుప్లెసి (సి) ధవన్ (బి) రబాడ 58; వాట్సన్ (బి) నోకియా 36; రాయుడు (నాటౌట్) 45; ధోనీ (సి) క్యారీ (బి) నోకియా 3; జడేజా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 179/4; వికెట్ల పతనం: 1-0, 2-87, 3-109, 4-129; బౌలింగ్: తుషార్ దేశ్‌పాండే 4-0-39-1; రబాడ 4-1-33-1; అక్షర్ 4-0-23-0; నోకియా 4-0-44-2; అశ్విన్ 3-0-30-0; స్టొయినిస్ 1-0-10-0.
ఢిల్లీ: పృథ్వీషా (సి అండ్ బి) చాహర్ 0; ధవన్ (నాటౌట్) 101; రహానె (సి) కర్రాన్ (బి) చాహర్ 8; శ్రేయాస్ అయ్యర్ (సి) డుప్లెసి (బి) బ్రావో 23; స్టొయినిస్ (సి) రాయుడు (బి) ఠాకూర్ 24; క్యారీ (సి) డుప్లెసి (బి) కర్రాన్ 4; అక్షర్ పటేల్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.5 ఓవర్లలో 185/5; వికెట్ల పతనం: 1-0, 2-26, 3-94, 4-137, 5-159; బౌలింగ్: దీపక్ చాహర్ 4-1-18-2, సామ్ కర్రాన్ 4-0-35-1; శార్దూల్ 4-0-39-1; జడేజా 1.5-0-35-0; కర్ణ్ శర్మ 3-0-34-0; బ్రావో 3-0-23-1.