స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా-భారత్ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ లంచ్ బ్రేక్ సందర్భంగా ఈ లిస్ట్‌ను స్టార్ స్పోర్ట్స్ (Star Sports Test Team Of The Year) విడుదల చేసింది. ఈ జాబితాలో ఓపెనర్లగా ఆసీస్ స్టార్ ఆటగాడు ఉస్మాన్ ఖావాజా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కింది. అదే విధంగా మూడు నాలుగు స్ధానాల్లో వరుసగా ఇంగ్లండ్ వెటరన్ జో రూట్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను స్టార్‌స్పోర్ట్స్ ఎంపిక చేసింది. ఐదో స్ధానంలో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రావిస్‌కు హెడ్‌కు అవకాశం దక్కింది.
వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ల కోటాలో టీమిండియా వెటరన్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవి అశ్విన్‌కు చోటిచ్చింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఆసీస్ స్పీడ్ స్టార్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు.
ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం. దీంతో స్టార్‌స్పోర్ట్స్‌పై కింగ్ కోహ్లి అభిమానులు మండిపడుతున్నారు. ఈ ఏడాది టెస్టుల్లో మిడిలార్డర్‌లో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లికి చోటు ఇవ్వడంపై అభిమానలుతో పాటు మాజీ క్రికెటర్ల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Here's Team
Star Sports Test team of the year. pic.twitter.com/I0JqE9rCOc
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023
స్టార్ స్పోర్ట్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం స్పందిచాడు. 'ఈ ఏడాది టెస్టుల్లో 55 బ్యాటింగ్ యావరేజ్ ఉన్న కోహ్లీకి ఇయర్ ఆఫ్ ది టీమ్‌లో చోటు దక్కకపోవడం షాకింగ్‌గా ఉందని' ఓ జాతీయ ఛానల్‌తో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది 8 టెస్టులు ఆడిన విరాట్.. 54.09 సగటుతో 595 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది.
స్టార్ స్పోర్ట్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్: ఉస్మాన్ ఖవాజా, రోహిత్ శర్మ, జో రూట్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్, జానీ బెయిర్‌స్టో, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టువర్ట్ బ్రాడ్.