IPL Trophy (Photo credit: iplt20.com)

Hyderabad, March 21: క్రికెట్ (Cricket) ప్రియులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL) వచ్చేస్తోంది. ఈ నెల 31న ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో హైదరాబాదీ క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో ఈసారి 7 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ ల నేపథ్యంలో, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రతినిధులు, బీసీసీఐ, హెచ్ సీఏ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భం సీపీ చౌహాన్ మాట్లాడుతూ... టికెట్ల విషయంలో గందరగోళం చోటుచేసుకోకుండా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మ్యాచ్ లకు భద్రత కల్పించడంపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని, స్టేడియం చుట్టూ అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Delhi liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ.. నిన్న 11 గంటల పాటు ఈడీ విచారణ.. రోజంతా హైటెన్షన్.. వీడియోతో

ఉప్పల్ లో ఐపీఎల్ సందడి ఇలా..

  • ఏప్రిల్ 2- సన్ రైజర్స్ × రాజస్థాన్ రాయల్స్
  • ఏప్రిల్ 9- సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్
  • ఏప్రిల్ 18- సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
  • ఏప్రిల్ 24- సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • మే 4- సన్ రైజర్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • మే 13- సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • మే 18- సన్ రైజర్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

CM KCR Message to BRS Activists: కవితపై ఈడీ విచారణ వేళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని కార్యకర్తలకు భరోసా