CM KCR Message to BRS Activists: కవితపై ఈడీ విచారణ వేళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని కార్యకర్తలకు భరోసా
CM KCR (Photo-ANI)

Hyd, Mar 20: బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ సర్కారు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. వచ్చే నెల 29 నాటికి ఈ సమావేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆత్మీయ సందేశం ఇచ్చారు. ‘అన్నంతినో అటుకులు తినో.. ఉపాసం వుండో 14 పండ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని.. లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుంది.

ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతున్న వేళ.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ బరితెగించి దాడులకు దిగిందన్న సీఎం.. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందంటూ సోమవారం సాయంత్రం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం కేసులో 7 గంటలు పైగా కవితను విచారిస్తున్న ఈడీ, ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నతెలంగాణ అదనపు ఏజీ

తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం. ఇది ఎన్నికల సంవత్సరం.. నిరంతరం ప్రజల్లో వుంటూ పనికిమాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజ స్కంధాలపైనే వుంది. ధర్మమే జయిస్తుంది’ అన్నారు.

ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొన్న వేళ.. ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. దుష్ఫ్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుంది. తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌ను ఎన్నడూ వదులుకోలేదు. చిల్లరమల్లర రాజకీయ శక్తులను ఏనాడూ ఆదరించరు. ప్రజలే కేంద్ర బిందువుగా బీఆర్‌ఎస్‌ పని చేస్తుంది అని తన సందేశంలో పేర్కొన్నారు సీఎం కేసీఆర్.

నన్ను ప్రేమించు లేదా ఏదైనా తాగి చావు, నిశ్చితార్థం జరిగిన యువతికి వేధింపులు, తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి

లక్ష కుట్రలను చేధించి నిలిచిన పార్టీ మనది(టీఆర్‌ఎస్‌-బీఆర్‌ఎస్‌). నాడు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా?. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారానికి దిగుతున్నాయి. ఆ ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలి. బీఆర్‌ఎస్‌ ఏర్పడిందనే బీజేపీ బరితెగించి దాడులకు పాల్పడుతోంది. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డుకుంటోందని లేఖలో మండిపడ్డారు.

21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టిసిపాయి మన పార్టీ. కష్టసుఖాలల్లో కలిసినడుస్తూ, ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ పల్లెల్లో గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను.

ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్ఎస్‌కు మాత్రం టాస్క్‌. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నం. కష్టాలు, కన్నీళ్లు, కరువులతో అల్లాడిన తెలంగాణ ఇవాళ పచ్చని పంటలతో చిరునవ్వులతో కళకళలాడుతున్నదని సీఎం తెలిపారు.