New Delhi, Mar 20: ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కాంలో నిందితుడు, హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిపి విచారించింది.
పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సౌత్ గ్రూప్‌తో సంబంధాలపై ముఖాముఖిగా వీళ్లను ప్రశ్నించినట్లు సమాచారం. సుమారు నాలుగు గంటలపాలు వీళ్లను ప్రశ్నించి.. అనంతరం పిళ్లైను కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించారు.ఒకవైపు కవిత విచారణ కొనసాగుతుండగానే.. తెలంగాణ అదనపు ఏజీ దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
గత వారం కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆమె విచారణకు హాజరుకాలేదు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుందని, న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వేచిచూడాలని కవిత ఈ నెల 16న లేఖ ద్వారా ఈడీకి విజ్ఞప్తి చేశారు. కానీ ఇవాళ రావాలని ఈడీ మళ్లీ నోటీసులు ఇవ్వడంతో కవిత విచారణకు హాజరయ్యారు.
ఢిల్లీ స్పెషల్ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అనంతరం పిళ్లైని తీహార్ జైలుకు తరలించారు. సుమారు నాలుగు గంటలపాటు ప్రశ్నించి.. అనంతరం పిళ్లైను కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. మరోవైపు కవితకు ఈడీ అధికారులు విడిగా విచారిస్తున్నారు.