Kalvakuntla Kavitha | File Image

Newdelhi, March 21: ఢిల్లీ లిక్కర్ స్కాంకు (Delhi Liquor Scam) సంబంధించి వెలుగు చూసిన మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవితను (Kavitha) మూడో సారి విచారణకు రావాలని ఈడీ (ED) కోరింది. నిన్న 11 గంటల సుదీర్ఘ సమయం విచారణ తరువాత తిరిగి ఇవాళ 11 గంటలకు విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ ఆమెను కోరింది. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు ఇప్పటి వరకూ రెండు సార్లు ప్రశ్నించారు. నిన్న ఉదయం ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించిన అధికారులు, ఆ తర్వాత ఆమెను విడిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈడీ ఎమ్మెల్సీ కవితను ఈసారి ఈ కేసులో నిందితుడైన అరుణ్ పిళ్లైతో కలిపి నిన్న మద్యాహ్నం వరకూ ఈడీ కవితను విచారించింది. ఇరువురినీ ఒకేసారి విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది. పిళ్లైను రిమాండ్‌కు తరలించాక తిరిగి కవిత విచారణ ప్రారంభమైంది. రాత్రి వరకూ విచారణ కొనసాగింది. దాదాపు 11 గంటల విచారన అనంతరం కవిత విక్టరీ సింబల్ చూపిస్తూ బయటకు వచ్చారు. ఇవాళ మరోసారి విచారణకు హాజరుకావల్సి ఉంది.

CM KCR Message to BRS Activists: కవితపై ఈడీ విచారణ వేళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని కార్యకర్తలకు భరోసా

చివరకు విచారణకు

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ రెండవ దఫా విచారణకు ఎమ్మెల్సీ కవిత ఈనెల 16 వతేదీనే హాజరుకావల్సి ఉంది. కానీ తన స్థానంలో తన న్యాయవాదిని పంపి తాను దాఖలు చేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున ఈనెల 24వ తేదీన తీర్పు వెలువడేవరకూ సమయం ఇవ్వాలని కోరారు. కానీ ఈడీ మాత్రం ఈ నెల 20 అంటే నిన్న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపింది. ఈ నేపధ్యంలో ఆమె విచారణకు హాజరౌతారా లేదా అనేది సందేహంగా మారింది. ఒకవేళ హాజరైతే పర్యవసానం ఎలా ఉంటుంది, హాజరుకాకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి చివరకు విచారణకు హాజరయ్యారు.

నన్ను ప్రేమించు లేదా ఏదైనా తాగి చావు, నిశ్చితార్థం జరిగిన యువతికి వేధింపులు, తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి

11 గంటల విచారణ

భర్త అనిల్, న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కవిత ఈడీ ఆఫీసుకు వెళ్లారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50  ప్రకారం ఈడీ అధికారులు దాదాపు 11 గంటలుగా కవితను విచారించారు. ఢిల్లీ ,హైదరాబాద్ సమావేశాల్లో చర్చకొచ్చిన వివిధ అంశాలపై కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ముఖ్యంగా మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితపై ప్రధానంగా ఆరోపణలున్నాయి. వీటికి సంబంధించి వివరణ కోరుతూ పలు కీలకాంశాలపై ఈడీ ప్రశ్నించింది. ముఖ్యంగా కేసులో నిందితుడైన అరుణ్ పిళ్తైతో కలిపి విచారణ కొనసాగించడం గమనార్హం.

Rajasthan: మేనల్లుడితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అత్త.. రెడ్ హ్యాండ్‌గా పట్టుకొని అందరి ముందు నిలదీయగానే ఏం జరిగిందంటే..?

ఈడీ ప్రశ్నించిన అంశాలివేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంతో పాటు మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర, నిందితులతో ఆమెకున్న సంబంధాలు, ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటాలు, 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. అదే సమయంలో అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ఆధారంగా కూడా కవితను ఈడీ వివరాలు అడిగి తెలుసుకుంది. ఇండో స్పిరిట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా లేదా, విజయ్ నాయర్‌ని 2021 మార్చ్ 19,20 తేదీల్లో కలిశారా లేదా, సిసోడియాను కలిశారా, మాట్లాడారా వంటి విషయాలపై సమాధానం రాబట్టేందుకు ఈడీ ప్రయత్నించింది. మరోసారి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Florida Shocker: గాజు సీసాలో ఇరుక్కుపోయిన పురుషాంగం, కోరిక తట్టుకోలేక ...

ఈడీ ఆఫీసు బయట రాత్రంతా హై టెన్షన్

విచారణ ముగిసిన తరువాత ఈడీ కవితను అదుపులో తీసుకుంటుందనే వార్తల నేపధ్యంలో నిన్న రాత్రంతా ఈడీ ఆఫీసు ముందు హై టెన్షన్ నెలకొంది. ఓ వైపు విచారణ జరుగుతుండగా కవిత తరపు న్యాయవాదులు, వైద్య బృందం  ఈడీ కార్యాలయానికి చేరుకోవడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన ఎక్కువైంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..విచారణ ముగిశాక తీసుకెళ్లేందుకు వచ్చామని ఆ న్యాయవాదులు తెలిపారు.