Team India (Photo Credits: @BCCI/Twitter)

దాయదులతో భారత్ పోరు అంటే మాములుగా ఉండదు. క్రికెట్ సమరం అయితే ఇక చెప్పనే అవసరం లేదు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవాల్సిందే. తాజాగా ప్రపంచ కప్‌ మెగా టోర్నీని (ICC T20 World Cup 2022) ప్రత్యక్షంగా స్టేడియాల్లో తిలకించే ఫ్యాన్స్‌ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచింది.

అక్టోబర్‌ 23న ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ మైదానంలో జరిగే భారత్, పాక్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం ( India vs Pakistan match tickets sold out )అంతా ఎగబడ్డారు. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే ఐసీసీ తమ వెబ్‌సైట్‌లో ‘హౌస్‌ఫుల్‌’ (అలొకేషన్‌ ఎగ్జాస్టెడ్‌) బోర్డు పెట్టింది. దాదాపు 90 వేల సామర్థ్యం గల ప్రతిష్టాత్మక ఎంసీజీ మైదానంలో టికెట్ల కోసం ఉన్న క్రేజ్‌ చూస్తే భారత్, పాక్‌ మ్యాచ్‌ విలువేమిటో అర్థమవుతుంది. 2007 నుంచి 2016 వరల్డ్‌కప్‌ వరకు ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గగా... 2021లో తొలిసారి పాక్‌ను విజయం వరించింది.

టీమిండియాను పట్టి పీడిస్తున్న కరోనా, భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి కరోనా, ఇప్పటికే ధావన్, గైక్వాడ్, శ్రేయాస్, సైనీ‌కి కరోనా పాజిటివ్

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌కు ఇంకా 8 నెలల 6 రోజుల సమయం ఉంది. అయితే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఆ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.