 
                                                                 పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు చేరింది.
సూపర్-8 సమరంలో బంగ్లాను మట్టికరిపించిన ఆఫ్ఘన్లు.. ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించి, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. కోచ్ జోనాథన్ ట్రాట్, బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కూడా ఆఫ్ఘన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు. ఘోర పరాభవంతో ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్, తొలిసారిగా సెమీఫైనల్స్‌కు చేరిన ఆప్ఘనిస్తాన్ జట్టు
వరుణుడి అంతరాయాల నడుమ సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగా.. గ్రూప్-1 నుంచి సెమీస్ రేసులో ఉండిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.
THE WINNING MOMENT FOR AFGANISTAN. 🇦🇫
- Pure raw emotions, the boys made it to the Semi Final. 🥹❤️pic.twitter.com/IMW34vfjbj
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024
బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
