Virat Kohli on Criticism: స్వార్థం కోసం నెమ్మదిగా ఆడావనే విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా లేకపోవడంతో చివరి వరకు బ్యాటింగ్..
Virat Kohli 'Shocked' As Shubman Gill Whacks Madushanka For A Boundary

ఆదివారం జరిగిన ICC ODI ప్రపంచ కప్ 2023 లీగ్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 49వ వన్డే సెంచరీతో ప్రపంచ రికార్డును సమం చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లీ 121 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. అయితే, చాలా మంది అభిమానులు, మాజీ క్రికెటర్లు కోహ్లీ నిదానంగా కొట్టినందుకు నిందించారు. వారిలో కొందరు భారత బ్యాటర్‌ను వ్యక్తిగత రికార్డుల కోసం బ్యాటింగ్ చేశారని ఆరోపించారు.

పాక్‌ మాజీ ఆటగాడు మహమ్మద్‌ హఫీజ్‌ ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ విరాట్ తన స్వార్థం కోసం ఆడాడని వ్యాఖ్యానించాడు. దానికి భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ వెంకటేశ్ ప్రసాద్ దీటుగా కౌంటర్‌ ఇచ్చాడు. జట్టు కోసం అతడు నిజంగా స్వార్థంగానే ఆడతాడని ఘాటుగా బదులిచ్చాడు. ఇక మ్యాచ్‌ అనంతరం విరాట్ కోహ్లీనే స్వయంగా దీనిపై వివరణ ఇచ్చాడు.

సచిన్ సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ.. బర్త్ డే రోజే సౌతాఫ్రికాపై 49వ సెంచరీ నమోదు చేసిన చిచ్చర పిడుగు

రోహిత్-శుభ్‌మన్‌ గిల్ మంచి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నేను అదే ఊపు కొనసాగించడంతోపాటు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాలి. అయితే 10వ ఓవర్‌ తర్వాత బంతి నుంచి టర్నింగ్‌ ఎక్కువగా ఉందనిపించింది. పిచ్‌ కూడా నెమ్మదించింది. అందుకే సింగిల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాం. మిగతా బ్యాటర్లతో కలిసి పరుగులు రాబట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. అదే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి నాకు వచ్చిన సందేశం. శ్రేయస్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించడం ఆనందంగా ఉంది. ఆసియా కప్‌ నుంచి మేం మూడు, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాం. ఎన్నోసార్లు పరుగుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.

సఫారీలను చిత్తుగా ఓడించిన భారత్, కనీసం 100 పరుగులు కూడా కొట్టలేక చతికిల పడ్డ సౌతాఫ్రికా, ఏకంగా 243 పరుగుల తేడాతో భారత్ విజయం

మ్యాచ్‌ మా చేతుల్లోకి రావాలంటే గొప్ప భాగస్వామ్యాలు అవసరం. ఇప్పటికే జట్టులో హార్దిక్‌ లేడు. కాబట్టి మిడిలార్డర్‌లో మా రెండు వికెట్లు చాలా కీలకం. అందుకే చివరి వరకూ బ్యాటింగ్‌ చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. సచిన్‌ రికార్డును సమం చేయడం ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది. అయితే, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. నా పుట్టిన రోజునాడు సెంచరీ కూడా ప్రత్యేకమే’’ అని విరాట్ వ్యాఖ్యానించాడు.

అయితే.. నెట్టింట్లో దీనిపై చర్చ కొనసాగుతోంది. రోహిత్, శ్రేయస్‌, సూర్య, జడేజా దూకుడుగా ఆడినప్పుడు విరాట్ ఎందుకలా నెమ్మదిగా ఆడాల్సి వచ్చిందని చర్చించుకోవడం గమనార్హం. మిడిల్‌ ఓవర్లలో పిచ్‌ కఠినంగా మారిందని.. అందుకే క్రీజ్‌లో పాతుకుపోయేందుకు కోహ్లీ నెమ్మదిగా ఆడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.