టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి దక్షిణాఫ్రికా సెమీఫైనల్ చేరింది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు ఈ సారి ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది.తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్‌గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్‌కు చేరాయి.రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ఘోర పరాభవంతో ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్, తొలిసారిగా సెమీఫైనల్స్‌కు చేరిన ఆప్ఘనిస్తాన్ జట్టు
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న హాగ్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు. హెండ్రిక్స్ సూపర్‌గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు అదరగొట్టి ఫైనల్‌కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు. సౌతాఫ్రికా సెమీస్‌లో గనుక అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా- ఆప్ఘనిస్తాన్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.