IND vs ENG, 5th Test 2022: చేతులెత్తేసిన బౌలర్లు, 5వ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం, 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం, టెస్టు సిరీస్‌ 2-2తో సమం
Joe Root and Jonny Bairstow celebrate the victory (Photo credit: Twitter)

ఎడ్డ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో (IND vs ENG, 5th Test 2022) ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-2తో సమం చేసింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

ఇంగ్లండ్‌ బ్యాటరల్లో జానీ బెయిర్‌స్టో(114), జో రూట్‌ (142) సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బెయిర్‌స్టో సెంచరీలు సాధించాడు.2007 తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్ గెలవాలన్న భారత కల కలగానే మిగిలిపోయింది. చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ జట్టు 377 పరుగుల లక్ష్యాన్ని ( England Register Highest-Ever Test Run Chase ) ఛేదించి, 7 వికెట్లతో విజయం నమోదు చేసింది.

టెస్టుల్లో బుమ్రా వరల్డ్ రికార్డ్, ఒక్క ఓవర్‌ లో 34 రన్స్ రాబట్టిన బుమ్రా, సంచలన బ్యాటింగ్‌ తో తుడుచుకుపోయిన పాత రికార్డులు, బుమ్రాపై మాజీ ప్రశంసల జల్లు

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ (146), జడేజా (104) రాణించడంతో భారత జట్టు 416 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్లు 284 పరుగులకు ఆలౌట్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో తీవ్రంగా తడబడిన భారత బ్యాటింగ్ లైనప్ 245 పరుగులకు చేతులెత్తేసింది. ఈ క్రమంలో 378 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు 76.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, రికార్డు సృష్టించింది.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు స్కోర్ వివరాలు..

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 416 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284 ఆలౌట్‌

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 245 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 378/3