IND vs NZ 1st ODI: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్‌ గిల్‌, వరుస శతకాలతో దూసుకుపోతున్న భారత యువ ఓపెనర్, వరుసగా రెండో శతకం నమోదు
Shubman Gill (Photo-BCCI)

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు.న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గిల్‌ 87 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. గిల్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలోనూ గిల్‌ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా వన్డేల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ.

ఈ క్రమంలోనే వన్డేల్లో గిల్‌ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. గిల్‌కు వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 19 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అలాగే విరాట్ కోహ్లీ 24 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా.. పాక్‌ ఆటగాడు ఇమాముల్‌ హక్‌తో కలిసి గిల్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్‌(18 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.

ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా ఫీట్ నమోదు

వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించడంతో పాటు అతి తక్కువ వన్డేల్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్‌ ధవన్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధవన్‌.. 17 వన్డేల్లో 3 సెంచరీలు పూర్తి చేయగా.. గిల్‌.. 19 వన్డేల్లో ఈ మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డుతో పాటు గిల్‌ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా (fastest Indian to 1000 runs in ODI history) రికార్డుల్లోకెక్కాడు.

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్, ప్రపంచకప్‌కి దూరం కానున్న రిషభ్‌ పంత్‌, మరో ఆరు వారాల్లో మరో కీలక సర్జరీ

ఈ జాబితాలో పాక్‌ ఆటగాడు ఫకర్‌ జమాన్‌ (18 వన్డేలు) అగ్రస్థానంలో ఉండగా.. గిల్‌, మరో పాక్‌ ఆటగాడు ఇమామ్‌ ఉల్‌ హాక్‌తో కలిసి రెండో స్థానం‍లో నిలిచాడు. భారత్‌ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో గిల్‌ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్‌ కోహ్లి (Virat Kohli's record), శిఖర్‌ ధవన్‌ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు.