వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలుత టెస్టు, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్ నవదీప్ సైనీకి మళ్లీ పిలుపునిచ్చారు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్‌లోకి సైనీ అరంగేట్రం చేశాడు. అయితే తన డెబ్యూ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన సైనీ.. ఇప్పటివరకు టెస్టుల్లో కన్పించలేదు.
సైనీ 4 ఇన్నింగ్స్‌లో 4.11 ఏకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఇప్పటివరకు 8 వన్డే, 11 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సైనీ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ లో అదరగొట్టిన మమమ్మద్ షమిని సెలక్టర్లు పక్కనబెట్టారు. వెస్టీండీస్ పర్యటనలో ఏ జట్టులో మొహమ్మద్ షమీకి చోటు దక్కలేదు.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.