India vs Australia (Photo Credits: Twitter)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో (India vs Australia 4th Test ) భారత్‌ పట్టుబిగిస్తోంది. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా సాగుతోంది. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచిన ఆస్ట్రేలియాకు భారత బ్యాట్స్ మెన్లు అదే రీతిలో సమాధానం చెబుతున్నారు. నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది.

ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్‌ అజింక్యా రహేనే 24 పరుగులకే పెవిలియన్‌ బాట పట్టి తీవ్రంగా నిరాశపరిచాడు.

బాక్సింగ్‌డే టెస్టులో భారత్‌ ఘన విజయం, ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు, రెండు జట్ల చెరో విజయంతో సిరీస్ 1-1తో సమం, జనవరి 7 నుంచి మూడో టెస్ట్

ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 208/3. విజయానికి ఇంకా భారత్‌ 122 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రిజ్‌లో పంత్‌ (12), పుజారా 43 ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/73)తో చెలరేగాడు. మరో పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌కు 4 వికెట్లు దక్కాయి. కాగా మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 369 (115.2) చేయగా భారత్ 336 (111.4) పరుగులు చేసింది.

అయితే మూడో సెషన్‌లో కూడా ఇదే జోరుతో ఆడితే 122 పరుగులు సులభంగా సాధించగలుగుతుంది. అదే జరిగితే బ్రిస్బేన్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించనట్లే అవుతుంది. దశాబ్దాల నుంచి ఈ పిచ్‌లో ఓటమనేదే లేకుండా దూసుకెళుతున్న ఆసీస్‌ను మట్టి కరిపించి గర్వంగా ఇండియా స్వదేశానికి తిరిగి వస్తుంది.